నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం

నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం
x
నాగోబా నాగేంద్ర స్వామి
Highlights

ప్రతి ఏడాది ఆదివాసీలు ఎంతో వైభవంగా జరుపునే నాగోబా జాతరను ఈ ఏడాది కూడా జరపుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని...

ప్రతి ఏడాది ఆదివాసీలు ఎంతో వైభవంగా జరుపునే నాగోబా జాతరను ఈ ఏడాది కూడా జరపుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహించే ఈ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా మెస్రం వంశీయులు ఈ జాతరను జరుపుకుంటారు. అంతే కాదు ఈ పండుగ రాష్ట్ర పండుగగా కూడా గుర్తింపు పొందింది.

ప్రతి ఏడాది పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని మెస్రం వంశీయులు మహాపూజను చేసినట్టుగానే ఈ ఏడాది కూడా శుక్రవారం రోజున ఈ పూజను నిర్వహించున్నారు. దీంతో నాగోబా జాతరకు అంకురార్పణ చేయనున్నారు. శుక్రవారం ప్రారంభం అయ్యే ఈ జాతర ఈ నెల 30వ తీదీవరకు అదికారికంగా, ఫిబ్రవరి 3 వరకు అనధికారికంగా జరిపిస్తారు.

ఈ జాతరలో మొదటి ఘట్టంగా మెస్రం వంశీయులు గంగానది జలాల కోసం కఠిన దీక్షను పూని దాదాపుగా 150 కిలో మీటర్ల కాలినడకన ప్రయాణించారు. తిరిగి ఈ గంగాజలం తీసుకుని ఈ నెల 20న కేస్లాపూర్‌లోని మర్రిచెట్టు (వడమరా)వద్దకు చేరుకున్నారు. ఇకపోతే కేవలం ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశీయులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ఆ వంశానికి చెందిన వారు పెద్ద ఎత్తున గురువారం సాయంత్రం వరకు 300 ఎడ్లబండ్లు, 110 వాహనాలతో తరలివచ్చి మర్రి చెట్టు వద్ద బసి గురువారం ఉదయాన్నే మెస్రం వంశంలో మృతి చెందిన 63 మంది పేరిట వారి ఆచారం ప్రకారం 'తూమ్‌'పూజలు నిర్వహించారు. ఈ పూజలను నిర్వహించడం వలన వారి పితృదేవతలు నాగోబా సన్నిధికి చేరుతారని వారు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ మహాపూజ అనంతరం మెస్రం వంశంలో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని మెస్రం కోడళ్లకు వారి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి నాగోబా దర్శనం చేయించి వారి వంశ పెద్దలను పరిచయం చేయిస్తారు. ఈ కార్యక్రమంతో వారు పూర్తిగా మెస్రం వంశంలోకి అడుగుపెట్టినట్టుగా వారు భావిస్తారు.

ఇక పోతే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ నాగోబా జాతరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఏడాది హాజరవుతారని, అదే విధంగా ఈ ఏడాది కూడా అందరూ హాజరుకానున్నారని మెస్రం వంశీయులు తెలిపారు. ఈ నేపథ‌్యంలోనే ఈ నెల 27వ తేదీన నాగోబా దర్బార్‌ ఏర్పాటు చేయనున్నట్లు మెస్రం వంశీయులు, అధికారులు తెలిపారు.

నాగోబా జాతర విషిష్టత..

నాగోబా జాతర అనేది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. అమావాస్య రోజు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి వారిని ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతుంటారు. ప్రతి ఏడాది జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. యేటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమవుతాయని గిరిజనుల నమ్మకం.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories