కాళేశ్వరంపై నాగ్‌, రవితేజ ఆసక్తికర ట్విట్స్‌

కాళేశ్వరంపై నాగ్‌, రవితేజ ఆసక్తికర ట్విట్స్‌
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా...

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరుకాగా ముఖ్య అతిథులుగా ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్, ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ మహోత్తర కార్యక్రమంపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోలు అక్కినేని నాగార్జున, రవితేజ ట్వీటర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. 'నీరే ప్రపంచానికి జీవం. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించినందుకు శుభాకాంక్షలు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అద్భుత ప్రతిభకి నిదర్శనం' అని నాగార్జున ట్విట్‌ చేయగా.. 'కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల ప్రతిభకి నిదర్శనం. ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు అభినందనలు' అని రవితేజ ట్విట్‌ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిన ఫోటో షేర్‌ చేశారు.కాళేశ్వరంపై నాగ్‌, రవితేజ ఆసక్తికర ట్విట్స్‌



Show Full Article
Print Article
More On
Next Story
More Stories