మటన్ ప్రియులకు షాక్..మంటపుట్టిస్తున్న ధరలు!

మటన్ ప్రియులకు షాక్..మంటపుట్టిస్తున్న ధరలు!
x
Highlights

ఇంట్లో సండే, ఫంక్షన్‌, పార్టీ, పండగ వచ్చిందంటే చాలు యాటకూర ఉండాల్సిందే. అది లేకపోతే నోట్లోకి ముద్ద కూడా దిగదు చాలామందికి.

ఇంట్లో సండే, ఫంక్షన్‌, పార్టీ , పండగ వచ్చిందంటే చాలు యాటకూర ఉండాల్సిందే. అది లేకపోతే నోట్లోకి ముద్ద కూడా దిగదు చాలామందికి. అలాంటి నాన్‌వెజ్‌ ప్రియులకు పెరిగిన ధరలు షాక్‌నిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెరిగిన మాంసం ధరలు చూస్తుంటే నాన్‌వెజ్‌ ప్రియులు హడలిపోతున్నారు. చెప్పాలంటే మటన్‌ మాటెత్తడానికి జంకుతున్నారు. రోజు రోజుకు మండిపోతున్న మటన్ రేట్‌తో మాంసహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరిగినా కూడా చాలా మంది తమ జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మటన్ ధరలకు రెక్కలు వచ్చి రోజురోజుకు.. మాంసం ప్రియులకు మటన్ భారంగా మారి పోతుంది. రోజురోజుకు మహా ప్రియంగా మారుతున్న మటన్ ధర మొన్నటి సంక్రాంతి వరకు ఆరు వందల రూపాయలకు కిలో పలికింది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కిలో ధర 650 రూపాయలు నుంచి 780 రూపాయలకు చేరుకుంది. ఇక బోన్‌లెస్‌ మటన్ కావాలంటే మాత్రం 720 రూపాయల నుంచి 820 వరకు పలుకుతోంది. విన్నమొన్నటి వరకు వందల్లో దొరికిన మాంసం ఇప్పుడు నాలుగు అంకెలకు చేరుకోవడంతో షాక్‌అవుతున్నారు.

ఇప్పటికే చాలామంది మాంసం ప్రియులు మటన్ తినాలని ఉన్న భారీగా పెరిగిన ధరలతో వెనకడుగు వేసి చికెన్ తింటూ సర్దుకుపోతున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మటన్ ధర 560 రూపాయల నుంచి 600 మధ్య పలుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే రోజు రోజుకు మాంసం ప్రియులు పెరుగుతుండడం.. ఇతర కూరగాయల కంటే మాంసం తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో మాంసానికి అధికంగా డిమాండ్ ఏర్పడుతుంది.. దీనివల్లే మాంసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజులు వెయ్యి రూపాయాలు కూడా పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు..

తెలంగాణలో గడిచిన ఏడాదిలోనే మాంసం వినియోగం 40 శాతం పెరిగింది. రాష్ట్రంలో మేకలన్నా గొర్రెల మాంసానికే డిమాండ్‌ ఎక్కువ. రాష్ట్రంలో సగటున 48 వేల నుంచి 50 వేల గొర్రెలను కోస్తున్నారు. ఇందులో మూడో వంతు ఒక్క హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. ఇక వారంతాలు,పండగలకు భాగ్యనగరంలో యాట కూరకే ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. పొట్టేలు మార్కెట్‌ కు డిమండ్‌ కు అనుగుణంగా దిగుమతి లేకపోవడంతో మటన్‌ ధరలు విపరింగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories