మోడరన్ పోలీసింగ్ చేయాలి: జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ

మోడరన్ పోలీసింగ్ చేయాలి: జగిత్యాల జిల్లా ఎస్పీ  సింధు శర్మ
x
Highlights

జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించే సిసిటీఎన్ సి రైటర్లు,రిసెప్షనిస్టు,కోర్ట్ కానిస్టేబుల్,బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ల కి వారి యొక్క...

జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించే సిసిటీఎన్ సి రైటర్లు,రిసెప్షనిస్టు,కోర్ట్ కానిస్టేబుల్,బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ల కి వారి యొక్క విధులకు సంబందించిన వెర్తీకల్స్ వారిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ సమీక్ష సమావేశం ను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతూ.ప్రస్తుత ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ ని మనకు అందుబాటులొ ఉన్న అంశాలు విరివిగా వాడుకుంటూ మోడరన్ పోలీసింగ్ చేయాలని, ప్రతి ఒక్కరు వారి విధుల్లో ఉపయోగించే అన్ని సాంకేతిక వ్యవస్థ లపై పూర్తి పరిజ్ఞానం కలిగియుండలి అని అన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది అందరికి పలు దఫాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, ఈ శిక్షణ శిబిరాలలో నేర్చుకున్న అంశాలు రోజువారీ విధుల్లో ఉపయోగిస్తూ వేగవంతమైన ఫలితాలు రాబట్టలని తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా పోలీస్ సిబ్బందికి నూతన సాంకేతిక విజ్ఞానంపై అవగాహన పెంపొందించుటకై శిక్షణ చాల దోహదపడుతుందని, ఇందులో భాగంగా హత్య కు సంబంధించిన, ఆస్తికి సంబంధించిన, రోడ్డు ప్రమాదాల నేరాలకు సంబంధించిన చిత్రాలను,ల్యాండ్ మార్క్స్ గుర్తులను జియోటాగింగ్ చేసి వాటిని "హాట్ స్పాట్" లుగా గుర్తించి,జియోటాగింగ్ ద్వారా ఏ ప్రాంతాల్లో ఏ విధమైన నేరాలు అధికంగా జరుగుతున్నాయి,వాటి నివారణకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు గురించి, అలాగే ఈ "హాట్ స్పాట్" లను గూగుల్ మ్యాప్ లో నందు చూసే విధానం సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. నూతన సాంకేతిక విజ్ఞానంను ఉపయోగిస్తూ నేరస్తులపై నిఘా పెంచడం, నేరాలను అదుపు, నేరపరిశోధనలో సాంకేతిక విజ్ఞానంను ఉపయోగిస్తూ త్వరిత గతిన నేరాలకు సంబంధించిన వాస్తవాలను కనిపెట్టడం, అలాగే టి.ఎస్.కాప్ సాఫ్ట్ వేర్ ద్వారా నేరాలను ఎలా నివారించావచ్చునో, నేరం జరిగిన తర్వాత నేరపరిశోధన వేగవతం చేయుటకు ఈ టి.ఎస్.కాప్ సాఫ్ట్ వేర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే విషయాలపై సిబ్బందికి వివరించారు.అదేవిధంగా డైల్ 100 సేవలు,పగలు రాత్రి నిర్వహించే బీటు డ్యూటీలలో పాయింట్ బుక్ చెకింగ్ నిర్వహించడం,తరచూ నేరాలకు పాల్పడే నేరస్తులపై, ఎమ్ఓ క్రిమినల్స్ పైన నిఘా వుంచడం,అదేవిధంగా ఏదైన నేరము జరిగినపుడు ఆ నేర స్తలం యొక్క నేర చిత్రము (క్రైమ్ మ్యాపింగ్) తయారు చేయుటలో టి.ఎస్.కాప్ సాఫ్ట్ వేర్ ప్రాముఖ్యత మరియు ఉపయోగించే విధానం గురించి చెప్పడం జరిగింది.ఈ యొక్క వర్ట్కల్స్ పై సంబంధిత డీఎస్పీ, సి.ఐ వారి వారి సబ్ డివిజన్ లో ప్రతి శనివారం రివ్యూ చేయాలి అన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీ మల్లరెడ్డి,సి.ఐ లు, ఐటీ కోర్ సిబ్బంది,అన్ని పోలీస్ స్టేషన్ ల,వెర్తీకల్ సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories