నేడే బక్రీద్..

నేడే బక్రీద్..
x
Highlights

త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. బక్రీద్ పండుగ సందర్భంగా సిటీలోని ఈద్గాలు, మసీదుల దగ్గర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖుర్బానీ ఇవ్వటం కోసం గొర్రెలు, మేకలు కొనుగోలు చేయటానికి ముస్లింసోదరులు పోటీపడటంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. బక్రీద్ పండుగ సందర్భంగా సిటీలోని ఈద్గాలు, మసీదుల దగ్గర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖుర్బానీ ఇవ్వటం కోసం గొర్రెలు, మేకలు కొనుగోలు చేయటానికి ముస్లింసోదరులు పోటీపడటంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగను ఈదుల్..అజహా, ఈదుజ్జహా.., బక్రీద్ అని కూడా అంటారు. ఈ సందర్భంగా ముస్లింలు ఖుర్భానీ ఇఛ్చేందుకు హైదరాబాద్ సిటీకి గొర్రెలు, మేకలను భారీగా తరలించారు. మలక్ పేట, చంచల్ గూడ, చాదర్ ఘాట్.. టోలిచౌకి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. పెద్ద పెద్ద పొట్టేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు రేట్లు బాగానే పెంచారు. అయినా 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలుకుతున్నా గొర్రెలు..మేకలు కొనటానికి పోటీపడుతున్నారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ మాదిరిగానే బక్రీద్ రోజుకూడా ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు జరుపుకుంటారు. ఆ తర్వాత వారు నెమరు వేసే జంతువులు ఒంటే., మేక, గొర్రెను బలిఇస్తుంటారు. బలి ఇచ్చిన జంతు మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని పేదలకు.. మరో భాగం బంధువులకు పంచుతారు. ఇంకో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. హైదరాబాద్ సిటీతో పాటు ప్రధాన పట్టణాల్లోని ఈద్గాల దగ్గర వేలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్ధనలు నిర్వహించనన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా హజరుకానున్నారు. ఇందు కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories