కరీంనగర్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

కరీంనగర్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన 2 రోజుల తరువాత ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన 2 రోజుల తరువాత ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక పోతే ఎంతో ఉత్కంఠగా సాగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుని ఇవాళ ఉదయం 7 గంటలకు ఈసీ చేపట్టారు. పట్టణంలోని ఎస్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ నిర్వహిస్తున్నారు. కాగా కరీంనగర్ కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా వాటిలో 20, 37 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు తుల రాజేశ్వరి, చల్లా స్వరూపారాణి బరిలో దిగగా ఈ రెండు డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇక పోతే మిగిలిన 58 డివిజన్లలో అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను లెక్కించి గెలుపు ఎవరిని వరించిందో తెలుపుతారు.

కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం ౩ రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియకు 58 మంది సూపర్వైజర్లు, ఇద్దరు చొప్పున అసిస్టెంట్లను ఈసీ నియమించింది. ఇందులో భాగంగానే 20 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లను చేసారు. ఇందులో భాగంగానే కౌటింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories