Municipal Elections 2020: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

Municipal Elections 2020: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
x
Highlights

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలెంజ్ గా మారాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలెంజ్ గా మారాయి. గల్లీ గల్లీ తిరిగి విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించిన నేతలు చివరి అంకంలో ఓట‌రు ను ప్ర‌స‌న్నంచేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. కాంగ్రెస్ పార్టీకి సీనియనర్ నాయకులకు ప్రతిష్టాత్మకం కావడంతో ఈఎన్నికలో విజయం సాధించడమే ద్యేయంగా ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే కొన్ని గంటల్లో కీలకం కానుండటంతో ఓట‌రు కి చేరువయ్యేలా కృషి చేస్తున్నారు.

తెలంగాణలో ము న్సిపల్ ఎన్నికలు సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజ‌కీయ పార్టీలన్నింటికి అస‌లు ప‌రీక్ష ఇప్పుడే మొద‌లైంది. బ‌హిరంగ స‌భ‌లు, ప్రచార ర‌థాలు, సోష‌ల్ మీడియాతో వీలైనంత ఎక్కువ ఓట‌ర్లను ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేశారు. ఆయనా పార్టీల అభ్యర్దులు నేతలు. ఇన్నిరోజలు వ‌ర‌కు చేసిన ప్రచారం కంటే.. వచ్చే 24 గంట‌ల్లో ఓట‌రును మ‌చ్చిక చేసుకునేందుకు నాయకులు ప్రచారం మొద‌లు పెట్టారు.

అయితే టిఆర్ఎస్ ను మ‌ట్టి క‌రిపిస్తామ‌ని స‌వాల్ చేసిన కాంగ్రెస్ పార్టీ 436 చోట్లా త‌మ నిల‌బెట్టక‌పోవ‌డం, భీఫాంలు అందించ‌క‌పోవ‌డం పార్టీకి సంక‌టంగా మారింది. నేతలు కో ఆర్డినేష‌న్ లోపం, పార్టీ సీనియర్ నేత‌ల మ‌ధ్య విభేదాలు ఇబ్బంది కరంగా మారాయి. మరోవైపు చాల మంది నేత‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గోన‌క‌పోవ‌డం కూడా కాంగ్రెస్ కి మైన‌స్ అని స్వయంగా గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలే చర్చించుకుంటున్నారు..

ఇటు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులు మాకు మేమే సాటి అన్నట్లుగా కాన్పిడెంట్ గా ఉంటే..ప్రతిప‌క్ష కాంగ్రెస్ కు మాత్రం ఈ ఎన్నిక‌లు జీవ‌న్మర‌ణ స‌మ‌స్యగా మారాయి. వ‌రుస ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలౌతున్న కాంగ్రెస్ మొన్నటి హుజుర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌తో మ‌రింత డీలా ప‌డింది. దీంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గౌర‌వ ప్రద‌మైన సీట్ల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుప‌ట్టి ప్రయాత్నాలు చేస్తున్నారు నేత‌లు. క‌నీసంగా 10 నుంచి 15 మున్సిపాల్టీలు, రెండు కార్పోరేష‌న్ల‌ను కైవ‌సం చేసుకోంటామ‌ని ధీమాగా చెబుతున్నారు.

మ‌రో వైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్న చోటా మ‌రింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మేడ్చెల్ పార్ల‌మెంట్ ప‌రిధిలో బోడుప్పల్, పిర్జాధీగూడ‌ , భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలో జ‌న‌గామా,భువ‌న‌గిరి, ఇబ్రహిం ప‌ట్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప‌రిధిలో 12 మున్సిపాల్టీలో హుజుర్ న‌గ‌ర్, కోద‌డాల‌లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందుక‌నుగుణంగా కాంగ్రెస్ మున్సిపాల్టీలు, కార్పోరేష‌న్ల‌లో చేయ‌బోయే అభివృద్ది పై విజ‌న్ డ్యాంకుమెంట్ ను రూపోందించారు. దీనికి కూడా ప్రజ‌ల‌నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక పిసిసి అధ్యక్షుడిగా ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవి చివ‌రి ఎన్నిక‌లు అని చెప్పుకోవ‌చ్చు. త్వర‌లోనే పిసిసి ఛీప్ అధ్యక్షుణ్ణి మార్చుతార‌నే సంకేతాలు రావ‌డంతో ఆయ‌న నేతృత్వంలో వ‌రుస ఓట‌మి అన్న ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శ‌త‌విధాల ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇక మాకు పిసిసి అధ్యక్ష ప‌ద‌వి కావాల‌ని కోరుకునే వారికి కూడా ఈ ఎల‌క్షన్స్ ఛాలెంజ్ అని చెప్పోచ్చు.

అందుకే ఆ ప‌ద‌వి అశిస్తున్న రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క్ లు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. వారు కూడా త‌మ త‌మ ప‌రిధిలో ని మున్సిపాల్టీలు, కార్పోరేష‌న్ల‌లో గౌర‌వ ప్రదంగా గెలుచుకుని ప‌ట్టు సాధించుకొని...త‌మ బ‌లాన్ని నిరుపించుకోనేందుకు ఈ ఆశావాహులంతా స‌వాల్ గా తీసుకున్నారు.

మొత్తానికి ఈ ఎన్నిక‌లు కాంగ్రెస్ లో నేత‌ల భ‌విష్యత్ కే కాదు... పార్టీ ప్రతిష్టకు కూడా ఛాలెంజ్ గా నిలిచాయ‌నడంలో సందేహాం లేదు. కాని రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరు వైపు నిల్చుంచారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories