ట్రాక్టర్ డ్రైవర్ గా ములుగు ఎమ్మెల్యే సీతక్క..

ట్రాక్టర్ డ్రైవర్ గా ములుగు ఎమ్మెల్యే సీతక్క..
x
Seethakka (File Photo)
Highlights

సీతక్క ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే కాదు.. ఓ అమ్మ గుర్తుకు వస్తుంది.

సీతక్క ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే కాదు.. ఓ అమ్మ గుర్తుకు వస్తుంది. ఆమె హోదాకు ఎమ్మెల్యే అయినా గిరిజన తండా వాసుల అభివృద్ది కోసం ప్రజల్లో మమేకమై అహర్నిషలూ శ్రమిస్తున్నారు. చుట్టూ గన్‌మేన్లు, సెక్యూరిటీని పెట్టుకుని డాబు చూపించకుండా కొండలు, గుట్టలు, వాగువంకలు అన్న తేడాలేకుండా తన నియోజక ప్రజలకోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. సాదా సీదా మహిళగా ఆమె నడుచుకుంటూ గిరిజనులకు తల్లో నాలుకలాగా ఉంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ప్రపంచాన్నే కుదిపేస్తున్న భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోకూడా ఆమె నిత్యం పల్లె ప్రజలతో మమేకమై, వారికి ఆహరం స్వయంగా తీసుకెళ్తూ ఆదుకుంటున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క.

లాక్ డౌన్ కాలంలో ఆమె చేసిన సహాయ కార్యక్రమాలు జాతీయ మీడియాను సైతం ఆకర్షించాయంటే అతిశయోక్తి కాదు. ఆమె అందరు ఎమ్మెల్యేలుగా కాకుండా కాస్త విభిన్నంగానే ఉన్నారనడానికి ఇది నిదర్శనం. తాజాగా సీతక్క ట్రాక్టర్ నడుపుతూ కనిపించారు. ములుగు మండలం జీవంతారావుపల్లి గ్రామ పంచాయితీ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా ఆ ట్రాక్టర్ ని సీతక్కే నడిపించారు. అంతే కాదు ఆ ట్రాక్టర్ లో తనతోపాటూ మరో నలుగుర్ని ఎక్కించుకున్నారు. ఆ తరువాల రైట్ రైట్ అంటూ గ్రామంలో సరదాగా ఓ రౌండ్ వేశారు. అయితే ట్రాక్టర్ నడపడం అనేది కూడా ఒక కళ అనే చెప్పుకోవాలి. దాన్ని డ్రైవింగ్ చేయడం అంటే సాదా సీదాగా కార్లు నడిపినంత తేలిక కాదు. కానీ ఓ మహిళా ఎమ్మెల్యే సీతక్క అవలీలగా దాన్ని నడిపి చూపించారు. అది చూసి అంతా సీతక్కా మజాకా అంటూ మెచ్చుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories