Top
logo

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు: రేవంత్

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు: రేవంత్
Highlights

యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్ నిర్మాణంలో ఆలయ ప్రాకారాల నిర్మాణం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. శిల్పులు అద్భుత ఆకృతులతో శిల్పాలను చెక్కుతున్నారు. అయితే, ఆలయ ప్రాకారాల్లో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ పథకాలు, టీఆర్‌ఎస్ గుర్తులను చిత్రీకరించడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.

యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్ నిర్మాణంలో ఆలయ ప్రాకారాల నిర్మాణం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. శిల్పులు అద్భుత ఆకృతులతో శిల్పాలను చెక్కుతున్నారు. అయితే, ఆలయ ప్రాకారాల్లో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ పథకాలు, టీఆర్‌ఎస్ గుర్తులను చిత్రీకరించడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. దేవతామూర్తులతోపాటు రాజకీయ నేతల చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ ఘాటుగా స్పందించారు. కోట్లాది మంది కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌ బొమ్మ, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు చెక్కడం దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ కోట్లాది మంది హిందువుల మనోభావాలను, భక్తుల నమ్మకాలను, విశ్వాసాలను దెబ్బ తీశారన్నారు. ఇదీ ప్రభుత్వ ఆదేశాలతో జరిగిందా? లేక అత్యుత్సాహంతో జరిగిందా అనేది తేలాలన్నారు.

Next Story

లైవ్ టీవి


Share it