రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి కామెంట్స్ అని పెట్టకండి.. నా పరువు పోతుంది: కోమటిరెడ్డి

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి కామెంట్స్ అని పెట్టకండి.. నా పరువు పోతుంది: కోమటిరెడ్డి
x
Highlights

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హుజుర్‌నగర్‌లో రేవంత్...

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హుజుర్‌నగర్‌లో రేవంత్ రెడ్డి చెబుతున్న అభ‌ర్ధి ఎవరో నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలకే తెలియదన్నారు. తమ జిల్లా రాజకీయాల్లో పక్క జిల్లా నాయకుల జోక్యం అవసరం లేదంటూ కామెంట్ చేసిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామన్నారు. మమ్మల్ని కాదని కొత్త అభ్యర్ధిని నిలబెడతారా ? అంటూ ప్రశ్నించిన కోమటిరెడ్డి రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి కామెంట్స్ అని పెట్టకండి అలా పెడితే నా పరువు పోతుందని సెటైర్ వేశారు. ఈ మధ్య పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు తమకు అవసరంలేదన్నారు. పీసీసీ రేసులో తాను ఒక్కడినే ఉన్నానని అన్నారు. గతంలో విభేదాలు ఉన్నా జానారెడ్డి,ఉత్తమ్, తాను ఒక్కటయ్యామంటూ కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories