తెలంగాణలో మరింత కఠినంగా లాక్ డౌన్.. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో..

తెలంగాణలో మరింత కఠినంగా లాక్ డౌన్.. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో..
x
Highlights

తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం కానుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో పాజిటివ్ కేసులు పెరిగిన ప్రాంతాలపై నిఘా ఉంచనున్నారు అధికారులు. హైదరాబాద్ సహా...

తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం కానుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో పాజిటివ్ కేసులు పెరిగిన ప్రాంతాలపై నిఘా ఉంచనున్నారు అధికారులు. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సరిగా అమలు చేయటం లేదన్న కేంద్రం ఆ ప్రాంతాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించింది. పాజిటివ్ కేసులు పెరుగుతోన్న ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ తో వివరించాలని ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ.

రోజురోజుకు పెరుగుతున్న కేసులతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో నాలుగో స్థానానికి చేరింది తెలంగాణ. నిన్నటి వరకు 334 కేసులు నమోదు కాగా అందులో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి అధిక కేసులు నమోదయ్యాయి. మార్చి 31 నుంచి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత నాలుగు రోజుల్లోనే 190 కేసులు నమోదు కావటంతో కేంద్ర అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా రెడ్ జోన్లలో హైదరాబాద్ ను చేర్చిన కేంద్రం నగరంలో లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేయాలని తెలిపింది.

పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమగ్రంగా అమలు కావట్లేదని కేంద్రానికి నిఘా వర్గాలు తెలిపాయి. దాంతో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరుపై వీడియో రికార్డింగ్‌ తీసి పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి అవసరమైతే తమకు వీడియో కాల్‌ ద్వారా పరిస్థితిని వివరించాలని సూచించింది.

అయితే రాష్ట్రంలో మార్చి 31 నుంచి నమోదవుతోన్న కేసుల్లో ఒకట్రెండు మినహా మర్కజ్‌ వ్యవహారంతో ముడిపడి ఉన్నవే. దేశమంతా లాక్‌డౌన్‌ విధించే సమయానికి తెలంగాణలోని ఐదారు జిల్లాల్లోనే కరోనా కేసులు నమోదవ్వగా మార్చి 26 నుంచి రాష్ట్రంలో ఢిల్లీతో కనెక్ట్‌ అయిన కరోనా కేసుల సంఖ్య బయటపడుతూ వస్తున్నాయి. దీంతో కరోనా ప్రభావం రాష్ట్రంలోని 25 జిల్లాలకు పాకింది. మరిన్ని జిల్లాలకు కరోనా పాకే అవకాశాలుండటంతో లాక్ డౌన్ పై సీరియస్ గా స్పందించింది కేంద్ర ప్రభుత్వం.

హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల నుంచి లైవ్ ఇన్ ఫర్మేషన్ తీసుకున్న కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీసింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయనున్నారు అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories