Coronavirus: ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు..!

Coronavirus: ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు..!
x
Highlights

ఇటలీ ఎయిర్ పోర్టులో తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. కరోనా భయంతో విద్యార్థులను అధికారులు నిలిపివేసారు. జనావో తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, నాగ్ పూర్, బెంగలూరుకు చెందిన మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు.

ఇటలీ ఎయిర్ పోర్టులో తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. కరోనా భయంతో విద్యార్థులను అధికారులు నిలిపివేసారు. జనావో తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, నాగ్ పూర్, బెంగలూరుకు చెందిన మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఎమ్మెస్ పూర్తి కావడంతో విద్యార్థులు భారత్ కు బయలు దేరారు. కాగా విమానాశ్రయ అధికారుల మాత్రం మెడికల్ సర్టిఫికెట్ ను తీసుకువస్తేనే విమానంలోకి అనుమతి ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు అక్కడే చిక్కుకు పోయారు. దీంతో ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన రష్మి మయూర్ కొయ్యాడ అనే వ్యక్తి ఓ వీడియోను ట్వీట్ చేశారు.

తమకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ఫిట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దీంతో వారు తమ స్వస్థలాలకు వెల్లలేక పోతున్నామని తెలిపారు. బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటే కొవిడ్-19 నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్తున్నారని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఆహారానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుగు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ స్పందించి విద్యార్థులు పింపిన వీడియోను రీట్వీట్ చేసాడు. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌ను, ఇటలీలోని ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేశారు.

విద్యార్థులకు సాయం చేయాలని విదేశాంగ మంత్రి జయశంకర్‌ను, ఇటలీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు కోరారు. ఈ విడియోలో విద్యార్థులు తెలిపిన వివరాలను చూసుకుంటే మేం దాదాపు 70 మంది వరకూ ఉన్నామని, ఇటలీలోని రోమ్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్నామని తెలిపారు. మాకు తినేందుకు తిండి కూడా లేదని తెలిపారు. ఎయిర్ పోర్టు అధికారులు బోర్డింగ్ పాస్ కూడా ఇవ్వడం లేదు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories