కాశ్మీర్‌ అంశాన్ని భారత్‌-పాక్‌లు తేల్చుకుంటాయి : మోడీ

కాశ్మీర్‌ అంశాన్ని భారత్‌-పాక్‌లు తేల్చుకుంటాయి : మోడీ
x
Highlights

ఫ్రాన్స్‌లో G-7 సదస్సు జరుగుతుంది. భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తా మోడీ...

ఫ్రాన్స్‌లో G-7 సదస్సు జరుగుతుంది. భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తా మోడీ తెలిపారు. ట్రంప్‌తో కాశ్మీర్‌ అంశంపై చర్చించారు. ట్రంప్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందని, దౌత్యపరంగా భారత్‌ అతిపెద్ద విజయమన్నారు. కాశ్మీర్‌ అంశం ద్వైపాక్షికమని మోడీ తేల్చిచెప్పారు. ఇరు దేశాల మధ్య జోక్యంలో మూడో వ్యక్తిని ఇబ్బందిపెట్టం సరికాదన్నారు. G-7 సదస్సు సాక్షిగా కాశ్మీర్‌ మధ్యవర్తిత్వంపై ట్రంప్‌ యూ టర్న్‌ తీసుకున్నారు.

గతంలో మధ్యవర్తిత్వం చేస్తానని ముందుకు వచ్చిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చారు. కాశ్మీర్‌ అంశాన్ని భారత్‌-పాక్‌లు తేల్చుకుంటాయని కామెంట్‌ చేశారు.ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కావడం ఆందంగా ఉందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. G-7 సదస్సులో భాగంగా కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇరువురు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుని నవ్వులు పువ్వులు పూయించారు. ఈ సందర్భంగా మోడీని రేపు విందుకు ఆహ్వానించారు డొనాల్డ్‌ ట్రంప్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories