మేమెప్పుడూ విలన్లేనా: ఒవైసీ

మేమెప్పుడూ విలన్లేనా: ఒవైసీ
x
Highlights

కశ్మీర్ లో వాతావరణం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మోడీ నయాకశ్మీర్ పేరుతో మరో మహాభారత యుద్ధానికి తెరలేపారన్నారు. సర్దార్‌...

కశ్మీర్ లో వాతావరణం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మోడీ నయాకశ్మీర్ పేరుతో మరో మహాభారత యుద్ధానికి తెరలేపారన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రుకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం నరేంద్ర మోదీకి లేదన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కశ్మీర్‌ అంశంపై వారు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్‌ ను ప్రేమిస్తుంది కానీ, కశ్మీరీలను కాదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, అమల్లో ఉన్న ఒప్పందాలను తుంగలో తొక్కారనీ చిందులేశారు. ప్రతీ సినిమాలోనూ హీరోనుంచి సైడ్ యాక్టర్ వరకూ మీరేనని, కేవలం విలన్ పాత్రలు మాత్రం మావా అంటూ ఒవైసీ మండిపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories