నేను ఎమ్మెల్యేని ఆఫీసర్‌.. గమనించండి!

నేను ఎమ్మెల్యేని ఆఫీసర్‌.. గమనించండి!
x
Highlights

తాను ఎమ్మెల్యేను..నేను ఈ కార్యక్రమం కోసమే వచ్చాను ఆఫీసర్.. అంటూ చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్పుకోవాల్సి వచ్చింది.

తాను ఎమ్మెల్యేను..నేను ఈ కార్యక్రమం కోసమే వచ్చాను ఆఫీసర్.. అంటూ చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే గురువారం 73వ స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు పోలీసులు గట్టిబందోబస్తు కల్పించారు. అయితే జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులుకు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానమేరకు పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో 19వ స్వాత్రంత్య వేడుకుల్లో పాల్గొనేందుకు వచ్చిన చొప్పదండి టీఆర్ఎస్ శాసభసభ్యుడు సుంకె రవిశంకర్‌ విషయంలో పోలీసు సిబ్బంది తడబాటు పడ్డారు.

పరేడ్ గ్రౌండ్ లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కేటాయించిన ప్రాంతంలోకి వచ్చారు అయితే అక్కడే ఉన్న ఓ సీఐ ఎమ్మెల్యే రవిశంకర్‌ను అనుమతించలేదు. ఎమ్మెలేతో పాటు చాల మంది పార్టీ సభ్యులు ఉండడంతో పోలీసు అధికారులు స్పల్ప పోరాబాటు పడ్డారు. వచ్చింది ఎమ్మెల్యేనో కాదో సరిగా చూసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేకు స్పల్ప కోపం వచ్చి ఓ ఆఫీసర్ నేను చొప్పదండి ఎమ్మెల్యేను కొంచెం గమనించండి అంటూ తనను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో వెంటనే సదరు పోలీసు అధికారి లోనికి అనుమతించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories