logo

గన్‌ మెన్ హఠాన్మరణం..కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

గన్‌ మెన్ హఠాన్మరణం..కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌
Highlights

రాజకీయ నేతలు అన్నాక భావోద్వేగాలకు అతీతంగా ఉంటారని భావిస్తాం. కానీ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్...

రాజకీయ నేతలు అన్నాక భావోద్వేగాలకు అతీతంగా ఉంటారని భావిస్తాం. కానీ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం ఇందుకు భిన్నం. ఎప్పుడూ గంభీరంగా కనిపించే శంకర్ నాయక్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. శ్రీనివాస్ భౌతికకాయాన్ని చూడగానే భోరున విలపించారు. గన్‌మెన్ మృతిని తట్టుకోలేని ఎమ్మెల్యే ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా ఏడ్చారు.

మహబూబాద్‌ జిల్లా మడిపెల్లిలో నిర్వహించిన శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ గన్‌మెన్ పాడెను మోశారు. అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ విలపించన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. గన్‌మెన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కుడి భుజంలా.. భావించేవారని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేకు అండగా ఉన్న గన్‌మెన్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లడం అటు పోలీసులు, ఇటు గ్రామస్తులను కలిచివేసింది. శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో తనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తమ కుటుంబ సభ్యుడుగా ఉన్న శ్రీను అందరిని వదిలి అందనంత దూరాలకు వెళ్లాడని కన్నీరు పెట్టుకున్నారు. ఆశ్రునయనాల మధ్య జరిగిన అంతియ యాత్రలో జనం భారీగా పాల్గొనడంతో మడిపెల్లి జనసంద్రంగా మారింది. పోలీసులు, రాజకీయ నాయకలు శ్రీనుకు ఘన నివాళి ఆర్పించారు.


లైవ్ టీవి


Share it
Top