Top
logo

గన్ పట్టినా, గన్‌మెన్‌తో ఉన్నా పేదల కోసమే.. సీతక్క ఫొటో వైరల్‌..

గన్ పట్టినా, గన్‌మెన్‌తో ఉన్నా పేదల కోసమే.. సీతక్క ఫొటో వైరల్‌..
X
Highlights

ములుగు ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు...

ములుగు ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తూ, కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఆమె ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

'మీ ఎట్‌ 20'పేరిట ట్విట్టర్‌ తదితర సోషల్‌ మీడియాలో నడుస్తోన్న చాలెంజ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ చాలెంజ్‌లో భాగంగా తాను 20 ఏళ్ల వయసులో తుపాకీ పట్టి అడవిబాట పట్టి ప్రజల కోసం పోరాడారు. అప్పుడు తీయించుకున్న ఫొటోను మీ ఎట్‌ 20 చాలెంజ్‌లో భాగంగా ఆమె పోస్టు చేశారు. తాను గన్‌ (మావోయిస్టుగా)తో ఉన్నా.. గన్‌మెన్‌తో ఉన్నా (ఎమ్మెల్యేగా ఉన్నా..) పేదల కూడు, గూడు, గుడ్డ కోసమేనంటూ రాసిన ఓ వ్యాఖ్య పలువురిని ఆకట్టుకుంది. ఈ ఛాలెంజ్ కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతోంది. రాజకీయాల్లోకి రాకముందు మావోయిస్టుగా పనిచేసిన సీతక్క ఇందులో భాగంగా తన అనుభవాలను పంచుకున్నారు.


Web TitleMLA seethakka photo goes viral
Next Story