Top
logo

అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన ప్రకటన

అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన ప్రకటన
X
Highlights

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. NPR, NRC, CAA వల్ల దేశంలోని ఏ పౌరుడికీ నష్టం జరగదని చెప్పినా.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. ఆయన తీర్మాన ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.


Web TitleMLA Raja Singh sensational announcement on CAA in Telangana Assembly
Next Story