కమలం పార్టీలో కలకలం రేపుతోన్న ఆడియో

కమలం పార్టీలో కలకలం రేపుతోన్న ఆడియో
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌ బతికే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమంటూ ఏఐసీసీకే మంట పుట్టించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌‌. మరో సంచలన...

తెలంగాణలో కాంగ్రెస్‌ బతికే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమంటూ ఏఐసీసీకే మంట పుట్టించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌‌. మరో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తానే ముఖ్యమంత్రినంటూ ఓ అభిమానితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు కమలం పార్టీలో కలకలం రేపుతోంది.

కార్యకర్త - సార్‌... మీరు పార్టీ మారుతున్నారంట? మీకు నేను వీరాభిమానిని‌...

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి - మారుతున్నాం... అందరం కలిసి మారుదాం... ఇప్పుడే కాదు... కొన్ని రోజుల తర్వాత

కార్యకర్త - అట్లా కాదు సార్‌... మీకోసం రెండు నెలలు కష్టపడ్డా...

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి - నా వెంబడే రా... అందరం కలిసిపోదాం

కార్యకర్త - ఇట్లా... పార్టీలు తిరుగుతుంటే ఎట్లా సార్‌

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి - అవును కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు... రాహులే రాజీనామా చేశాడు.... అందరం కలిసి బీజేపీలోకి పోదాం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌... దేశ మొత్తం బీజేపీనే వస్తుంది... బీజేపీ గెలిస్తే నేను సీఎం అవుతా... చీఫ్ మినిస్టర్ అయితా నేను...

కార్యకర్త - మీరు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది సార్‌

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి - బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతా

కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి మాట్లాడినట్లుగా వైరల్‌ అవుతోన్న ఆడియోలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినంటూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ బతికే పరిస్థితి లేదని, రాహులే పార్టీని నడపలేక రాజీనామా చేశాడని, ఏపీ, తెలంగాణే కాదు దేశం మొత్తం బీజేపీనే వస్తుందని ఆ ఆడియోలో ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినట్లు చెబుతోన్న ఆడియోపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌‌రావు స్పందించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చే వారు పార్టీ అభివృద్ధిని ఆశించి రావాలి కానీ, పదవులు ఆశించి వస్తే నిరాశ తప్పదన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే, తానే ముఖ్యమంత్రినంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరుతో వైరల్‌ అవుతోన్న ఆడియో రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఆడియోపై ఇప్పటికే బీజేపీ అధికార ప్రతినిధి కౌంటరివ్వడంతో మిగతా ముఖ్యనేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories