శభాష్ ఎమ్మెల్యే గారు ... మీ ఆలోచన అదరహో

శభాష్ ఎమ్మెల్యే గారు ... మీ ఆలోచన అదరహో
x
Highlights

వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీకో వినాయకుడు , సంఘానికో వినాయకుడు , కాలినీకో వినాయకుడు ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి . ఇందులో మళ్ళీ...

వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీకో వినాయకుడు , సంఘానికో వినాయకుడు , కాలినీకో వినాయకుడు ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి . ఇందులో మళ్ళీ రసాయనాలతో కూడిన వినాయకుడిని చేయడం వలన పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది .. అంతే కాకుండా అక్కడే మైకులతో , డీజే లతో శబ్ద కాలుష్యం కూడా జరుగుతూ ఉంటుంది .. అయితే ఈ సారి గల్లీకో వినాయకుడు వద్దు ... గ్రామానికో వినాయకుడు ఉంటే చాలు. అది కూడా మట్టి వినాయకుడు చాలునని ఓ గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు టీఆర్ఎస్ నేత , సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ...

సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామా ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు .. ఈ సంవత్సరం జరగబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను గ్రామం మొత్తానికి ఒకటే పెట్టి జరుపుకుందామని అయన పిలుపునిచ్చారు .. అంతే కాకుండా దీనికి 'ఏక వినాయక మహోత్సవం' అని నామకరణం కూడా చేసారు .. దీనివల్ల ట్రాఫిక్ నుండి విముక్తి కూడా పొందవచ్చునని అయన చెప్పుకొచ్చారు .. హరీష్ రావు చెప్పిన ఆలోచన నిజానికి చాలా గొప్పదని సిద్ధిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామస్థులు దీనికి ఒకేనని ఊరంతా కలిసి తీర్మానం చేసారు .

మిట్టపల్లి గ్రామం లాగే మిగతా గ్రామాలు కూడా దీనికే ఒకే అనడం ఖాయమేనని తెలుస్తుంది . హరీష్ రావు ఆలోచనని మిగతా నేతలందరు ఆదర్శంగా తీసుకుంటే మనం పర్యావరణాన్ని కాపుడుకోవడం అనేది పెద్ద విషయమేమి కాదు .. ఇక హరీష్ రావు ఆలోచనకి గాను సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు నుండి మంచి స్పందన వస్తుంది . ఎమ్మెల్యే గారు మీ ఆలోచన అదరహో అని కామెంట్స్ పెడుతున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories