logo

నేను ఏమైనా దోపీడీ చేశానా.. హత్యలు చేశానా : ఎమ్మెల్యే బోడే ప్రసాద్

నేను ఏమైనా దోపీడీ చేశానా.. హత్యలు చేశానా : ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Highlights

కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు...

కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. పెనమలూరు మండలం వణుకూరు గ్రామ పరిధి లోని పుల్లేరులో కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వడం, చెట్లను నరకడం వివాదాస్పదమైంది. పుల్లేరువాగులో అక్రమంగా మట్టి తవ్వి ఆ చుట్టుపక్కల పొలాలను ప్లాట్లుగా మార్చేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వణుకూరుకు చెందిన కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. పుల్లేరులో మట్టి తవ్వకం పనులు చేస్తున్న యంత్రాలను సీజ్‌ చేశారు అధికారులు.. ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.

విషయం నేను ఏమైనా దోపీడీ చేశానా.. హత్యలు చేశానా : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దృష్టికి వెళ్లింది. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రసాద్ తన కార్యాలయానికి తీసుకు వెళ్లాడు. అయితే విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. సీజ్ చేసిన వాహానాన్ని అప్పగించాలని ఎమ్మెల్యేను కోరారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన యంత్రాన్ని దౌర్జన్యంగా తీసుకు వచ్చిన తీరుపై ఇన్ చార్జి కలెక్టర్ గా ఉన్న జేసీకి సమగ్ర నివేదిక సమర్పించాలని పెనమలూరు తహశీల్దారు మురళీకృష్ణను ఆదేశించి వెళ్లిపోయారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వినందుకు వాల్టా చట్టం కింద కేసులు పెడతామని మిషాసింగ్ హెచ్చరించారు.

రైతులు తమ గట్లకు ఈ మట్టిని వాడుకుంటున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు. తాను ఏమైనా దోపీడీ చేశానా.. హత్యలు చేశానా అంటూ ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారుల తీరు సరైంది కాదన్నారు. రైతులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పొలంగట్టును పటిష్టం చేసుకోవడానికి కూడా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలనడం. కేసులు పెడతామనడం న్యాయమా అని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల తీరుపై చంద్రబాబును కలిసి అంతా వివరిస్తానన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్.


లైవ్ టీవి


Share it
Top