అలా అయితే.. ఆ వినాయకుడికి ఎమ్మెల్యే 5 లక్షలు ఇస్తారు!

అలా అయితే.. ఆ వినాయకుడికి ఎమ్మెల్యే 5 లక్షలు ఇస్తారు!
x
Highlights

వినాయకుని పండగ వచ్చేస్తోంది. ఊర్లూ.. వీధులూ వినాయకుని కొలువు తీర్చడానికి సిద్ధం అయిపోతున్నాయి. ఒక ఊరిలో పది చోట్ల వినాయకుని పూజలు చేసే బదులుగా ఊరంతా ఒక గణపతిని ప్రతిష్ఠిస్తే..పర్యావరణానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి అటువంటి ఊరి వినాయకునికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

మరో పండుగకు సిద్ధమౌతున్నారు ప్రజలు. మొన్నటి వరకు బోనాల పండుగలో బీజీ బీజీగా ఉన్న ప్రజలు ఇప్పుడు మరో పండుగకు రేడీ అయ్యారు. ఆ పండుగే వినాయకచవితి. ఈ పండుగ వచ్చింది అంటే చాలు.. రంగు రంగుల వినాయకులు, డీజేలు, బ్యాండ్ బాజాతో ఏ రేంజ్‌లో ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. దీంతో ధ్వని, వాయు, నీటి కాలుష్యం జరుగుతుంది. అయితే ఈ సౌండ్ సొల్యూషన్, పర్యావరణ రక్షణను దృష్టిలో ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మాములుగా చూస్తే గ్రామంలో ఎంత కాదన్న ఓ 15 వినాయక విగ్రహాలు పెడతారు. అయితే ప్రతి గణేశుడి దగ్గర మైక్ సెట్లు లాంటివి పెడుతుంటారు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్తగా ఆలోచించాడు. ఊరికి ఒకటే గణపతి పెట్టండి.. అది కూడా మట్టి గణపతినే ప్రతిష్ఠించండి అని తన నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఊరు మొత్తం ఓకే విగ్రహం పెట్టుకుంటే.. రూ. 5లక్షలు ఇస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఈ ప్రకటన చేయడానికి గల కారణాన్ని ఎమ్మెల్యే వెల్లడించారు. తన చిన్నప్పుడు కూడా ఊరిలో ఓకే విగ్రహం పెట్టేవారిమని.. అందరం ఒకే చోట చేరి భక్తి శ్రద్ధలతో పూజించేవారిమని అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రావాలంటే..ఊరిలో ఒకే విగ్రహం పెట్టుకోవాలని ఈ రూ.5 లక్షల బహుమతి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగా, ఒకే విగ్రహం ఉన్న గ్రామాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఊరిలో ఒకే వినాయక విగ్రహం ఉన్న గ్రామానికి రూ.5లక్షలు వెంటనే మంజూరు చేస్తాం అని ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories