ఇంటర్ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులు..

ఇంటర్ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులు..
x
Highlights

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం ఇంటర్ బోర్డు ఇంగ్లీష్ పరీక్షను నిర్వహిస్తుంది. కాగా ఈ పరీక్షా ప్రశ్న పత్రంలో అనేక తప్పులు దొర్లాయి.

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం ఇంటర్ బోర్డు ఇంగ్లీష్ పరీక్షను నిర్వహిస్తుంది. కాగా ఈ పరీక్షా ప్రశ్న పత్రంలో అనేక తప్పులు దొర్లాయి. దీంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసారు. తాము రాసే పరీక్ష పత్రంలో 5, 7, 10, 12, 14, 17 నంబరు ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని, దీంతో 15 మార్కుల వరకు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

వీటిలో 14వ ప్రశ్నను అసంపూర్తిగా ఇవ్వగా.. మిగతా ప్రశ్నల్లోనూ అనేక తప్పులు దొర్లాయని తెలిపారు. అక్షరాల్లో తప్పులతో పాటు, ఒక పదానికి బదులు మరో పదం ముద్రితం కావడం, వాక్య నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈసారి పత్రంలో ఎలాంటి తప్పులు తలెత్తకుండా జాగ్రత్త వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు మాట నిలుపుకోలేపోయిందని తెలిపారు.

అయితే ఈ తప్పులు ఉన్నాయని తెలిసే లోపే దాదాపుగా పరీక్ష పూర్తయిందని, చివరి 10-30 నిమిషాల ముందు తప్పులను సరి చేసుకోవాలని సమాచారం వచ్చిందని తెలిపారు. కాగా దీని కోసం అదనంగా కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులు కోరారని, అందుకు ఇన్విజిలేటర్లు ఇవ్వలేదని తెలిపారు. ప్రశ్నపత్రం ప్రింట్‌ చేసిన తరువాత ప్రూఫ్‌ రీడింగ్‌ చేయకపోవడం, తప్పులను సరిదిద్దడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని లెక్చరర్లు పేర్కొంటున్నారు.

మొత్తం ఒక్కో సబ్జెక్టుకు 12 ప్రశ్నపత్రాలు తయారు చేయిస్తారు. వాటిని కంప్యూటర్‌ ద్వారా టైపు చేయించిన తర్వాత తప్పకుండా పరిశీలించాల్సి ఉన్నా అది జరగడం లేదని తెలుస్తుంది. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పులపై ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ స్పందించారు. ఇందులో భాగంగానే 14వ ప్రశ్న అసంపూర్తిగా ఉన్నందున ఆ ప్రశ్నను అటెంప్ట్‌ చేసిన విద్యార్థులకు 4 మార్కులు ఇస్తామని స్పష్టం చేసారు.

మిగిలిన ప్రశ్నలను విద్యార్థులు అర్థం చేసుకుని రాయాలని తెలిపారు. తప్పులతో ప్రశ్నపత్రాలను రూపొందించిన వారిపై చర్యలు చేపడతామన్నారు. అచ్చు తప్పుల విషయంలో ఉదయం 9:45 గంటలకే అన్ని పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి సరి చేయించామన్నారు.

ప్రశ్నపత్రంలో తప్పలు దొర్లిన పదాలు ఇవే what అనే అక్షరానికి బదులు why అని ముద్రితమైంది. మరో ప్రశ్నలో ear అనే అక్షరానికి బదులు year అని ప్రచురితమైంది. మరో ప్రశ్నలో once wrote a book called the discovery of india బదులు you know that i once wrote discovery of india అని తప్పుగా ఉంది. మరో ప్రశ్నలో discipline అని ఇవ్వడానికి బదులుగా disipline అని ఇచ్చారు. మరో ప్రశ్నలో a book అనే పదం ఉండాల్సి ఉండగా.. అది లేకుండానే ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories