రెండేళ్ల తర్వాత టిక్ టాక్‌తో జాడ లభ్యం

రెండేళ్ల తర్వాత టిక్ టాక్‌తో జాడ లభ్యం
x
Highlights

టిక్‌టాక్ ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా షార్ట్ క్లిప్స్ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తూ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేస్తున్నారు.

టిక్‌టాక్ ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా షార్ట్ క్లిప్స్ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తూ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యువతీయువకులైతే ఈ టిక్‌టాక్‌లో వినూత్న రీతిలో టిక్‌టాక్‌ వీడియోలను చేస్తూ లైక్స్ పొందుతూ ఆనందపడుతుంటారు. ఇప్పటివరకు టిక్‌టాక్‌మోజులో ప్రాణాలు పోయాయి, కాపురాలు కూలిపోయాయి. చదువులు అటకెక్కాయి ఉద్యోగాలు ఊడిపోన్నాయి. లేటెస్ట్‌గా మాత్రం టిక్‌టాక్‌ ఓ కుటుంబాన్ని కలిపి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది. అయితే టిక్ టాక్ ద్వారా చెడే కాదు అప్పడప్పుడు మంచిపనులు కూడా జరుగుతుంటాయని ఈ ఘటన నిరూపించింది.

రెండేళ్ల క్రితం పాల్వంచలో తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ టిక్ టాక్ పుణ్యామాని అతని కుటుంబ సభ్యులకు లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే దొడ్డా వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలం పినపాక పట్టినగర్‌ లో నివాసం ఉండేవాడు. అతను లారీక్లీనర్ గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వచ్చిన జీతంలో కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటేశ్వర్లు 2018 ఏప్రిల్‌లో పనినిమిత్తం పాల్వంచ పట్టణానికి వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో ఏదో ఒక లారీ ఎక్కి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు.

రోజులు, వారాలు గడుస్తున్నాయి, అయినా అతని జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. అయినా దొరకక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. దీంతో అతను లేడని, తిరిగి రాడని ఆశలు వదిలేసుకున్నారు. అలా ఆశలు వదిలేకున్న కుటుంబానికి రెండేళ్ల తరువాత ఆ వ్యక్తి బతికే ఉన్నాడని ఓ వ్యక్తి ద్వారా తెలియడంతో ఆనందంలో మునిగిపోయారు. పినపాక గ్రామానికి చెందిన నాగేంద్రబాబు అనే యువకుడు ప్రతి నిత్యం టిక్ టాక్ వీడియోలను చూస్తూ, చేస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తికి తప్పిపోయిన వెంకటేశ్వర్లు పంజాబ్‌లో భిక్షాటన చేస్తున్న వీడియోను చూశాడు. వెంటనే నాగేంద్రబాబు వీడియోలో ఉన్నతమ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లేనని గుర్తించాడు.

అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. టిక్ టాక్ వీడియో సాయంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. తప్పిపోయిన వ్యక్తి ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్నాడని నిర్ధారించారు.అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో కుటుంబ సభ్యులు అతన్ని కలవలేక పోతున్నారు. ఎలాగయినా వెంకటేశ్వరుల్నిసొంతూరు రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని, సాధ్యమైనంత త్వరగా అతణ్ని సొంతూరు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories