పల్లెల సంపూర్ణ అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్

పల్లెల సంపూర్ణ అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్
x
Highlights

పల్లెల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన, మహిళ శిశు అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. పల్లె...

పల్లెల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన, మహిళ శిశు అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి సమగ్ర నిర్వహణ కోసం...పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నందన గార్డెన్ లో బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధ్యక్షత న ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి విజయవంతం చేయాలని అనుకున్నాం కానీ 11వ స్థానంలో ఉన్నామని, వచ్చే పల్లె ప్రగతిలో రాష్ట్రంలో మొదటి స్థానానికి మన జిల్లా వచ్చేలా అందరం సమిష్టి కృషి చేయాలని కోరారు. ఫోటోల కోసం కాకుండా ప్రగతి నిజంగా జరిగేలా పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందరికి అందించారని తెలిపారు. అంతే కాక గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతి నిరంతరం ప్రక్రియ అని, పల్లె ప్రగతిలో మిగిలిన పనులల్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెల25వ తేదీ తర్వాత మంత్రులు, అధికారులు పల్లెలో నిద్రలు చేస్తున్నారని స్పష్టం చేసారు.

గ్రామాల్లో విద్యుత్తు 3rd ఫేస్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండొద్దని సీఎం ప్రత్యేకంగా చెప్పారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ లైన్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిని సరిదిద్దాలని చెప్పారు. ఇప్పుడున్న సర్పంచులు నిజంగా అదృష్ట వంతులని, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మీరు నీళ్లకు ఖర్చు పెట్టే బాధ తప్పిందన్నారు. నిబద్ధతతో పని చేసే సర్పంచులకు అధికంగా నిధులు ఇస్తామని తెలిపారు. సర్పంచ్ లు 5 ఏళ్ల పదవీకాలం అయ్యే నాటికి జిల్లాలోని ప్రతి గ్రామం గంగాదేవి పల్లి లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

అంతేకాక అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా స్త్రీలు, శిశువులకు అందజేయాలన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలన్ని పూర్తిగా అభివృద్ధి చెంది దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోందని. అదేవిధంగా మన జిల్లా కూడా రాష్ట్రానికి ఆదర్శం అయ్యేలా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఉన్న అడవులను కాపాడుకోవడంతో పాటు వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. పల్లె ప్రగతిలో గ్రామంలో అందరిని భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని కోరారు. పల్లె ప్రగతిలో సర్పంచులు హీరోలు, డైరెక్షన్, ప్రొడ్యూసర్ సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, స్థానిక సంస్థలు పూర్తి బాధ్యత వహించి గ్రామాల లో మౌలిక సదుపాయాలు అయిన నర్సరీ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పల్లె ప్రగతి అంశాల ప్రగతి లో వెనుకంజలో ఉన్న గ్రామాలు వెంటనే పుంజుకోవాలని లేనిచో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక ఇంతకు ముందు 2 సార్లు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల పారిశుధ్యం మెరుగుపడి, హరిత హారం లో గత 5 ఏండ్లలో విరివిగా మొక్కలు నాటడం ద్వారా దేశంలోనే సుమారు 5 వేల హెక్టర్లలో మొక్కాలు నాటి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories