logo

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2017 డీఎస్సీ పరీక్ష ద్వారా భర్తీ చర్యలు చేపట్టగా 336 మంది మాత్రమే అర్హత సాధించారని వెల్లడించారు

రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పదవులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలు 1109 ఉన్నాయని తెలిపారు. 5,964 పోస్టుల భర్తీ చేపట్టగా, ఇప్పటి వరకూ 4,418 మందిని నియమితులైయ్యారని తెలిపారు. 2017 డీఎస్సీ పరీక్ష ద్వారా భర్తీ చర్యలు చేపట్టగా. ఉర్దూ మీడియం పోస్టులు 900 గాను 336 మంది మాత్రమే అర్హత సాధించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఉర్దూ పాఠశాల్లో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పంధిస్తూ.. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై దృష్టిపెట్టామని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top