పల్లె ప్రగతికి సమాయత్తం కావాలి : మంత్రి పి. సబితారెడ్డి

పల్లె ప్రగతికి సమాయత్తం కావాలి : మంత్రి పి. సబితారెడ్డి
x
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసారని, అవి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసారని, అవి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి పి. సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలలో 106 సబ్సీడీ ట్రాక్టర్లను ఆదివారం ఆమె పంపిణీ చేసారు. ట్రాక్టర్ల పంపిణీలో భాగంగా మంత్రి ట్రాక్టర్‌ ను నడిపి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, జైపాల్‌ యాదవ్ లు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి పల్లె స్వచ్ఛ గ్రామాలుగా మారాయని ఆమె తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా పల్లెలకు ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల అవుతాయన్నారు. అందులో భాగంగానే ఈ జిల్లాకు రూ.50.60 కోట్లు మంజూరయ్యాయని మంత్రి స్పష్టం చేసారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలను గుర్తించి వారికి నెలకు రూ.8500 వరకు జీతం పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఈ ట్రాక్టర్ల ద్వారా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణతో పాటు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు నీరు పోస్తూ సంరక్షించేందుకు వీటిని వినియోగించాలన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజల వెన్నంటే ఉంటామని మంత్రి స్పష్టం చేసారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories