పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌ పనులు తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్

పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌ పనులు తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్
x
Highlights

పంజాగుట్ట రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జ్‌ పనులను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు తనిఖీ చేశారు.

పంజాగుట్ట రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జ్‌ పనులను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని నిర్మాణ సంస్థను, ఇంజ‌నీరింగ్ అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

లాక్ డౌన్ వలన పనుల నిర్వహణకు వెసులుబాటు కలిగిందని, ఈ నేపథ్యంలోనే నిర్మాణ సంస్థలు అద‌నంగా మరికొంత మంది కార్మికుల‌ను, నిపుణుల‌ను నియ‌మించి త్వరగా పనులు పూర్తి చేస్తున్న కాంట్రాక్ట‌ర్‌ను ఆయన అభినందించారు. ఇదే వేగంతో మరిన్ని రక్షణ చర్యలు తీసుకుంటూ నెలరోజుల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జి, రెండు వైపులా రెండు లేన్ల‌ విస్త‌ర‌ణ ప‌నులు 50శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. బ్రిడ్జి పరిశీలన పనుల్లో కేటీఆర్ తో పాటు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, శాస‌న స‌భ్యులు దానం నాగేంద‌ర్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌లు ఉన్నారు. వారితో పాటు స్థానిక కార్పొరేట‌ర్ మ‌న్నె క‌విత‌గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఇంజ‌నీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories