దిగుమతి చేయడం కాదు.. ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి : కేటీఆర్‌

దిగుమతి చేయడం కాదు.. ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి : కేటీఆర్‌
x
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
Highlights

తెలంగాణ రాష్ట్రలోని హైదరాబాద్ నగరంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్‌ కాంక్లేవ్‌ను ప్రారంభించారు.

సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్‌ కాంక్లేవ్‌ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సమావేశంలో కేటీఆర్ క్వాలిటీ స్టాండర్డ్స్‌ ఇన్‌ఏరోస్పేస్‌ అండ్‌ ఢిపెన్స్‌పై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు భాగస్వామ్యంతో ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగాల్లో హైదరాబాద్‌ వృద్ధి చెందుతోందని, బాలానగర్‌, కుషాయిగూడలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ విడి భాగాల తయారీ కంపెనీలున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రానికి చాలా లాభాలున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. హైదరాబాద్‌ - బెంగళూరు హైవే మార్గంలో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడామని ఆయన తెలిపారు.

అనంతరరం ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన డిఫెన్స్‌కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఉందని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గడిచిన ఐదేళ్లలో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిసానని ఆ‍యన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని వాళ్లని కోరామని అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories