కేటీఅర్ అన్నా మా ఊరికి పంపండి.. మంత్రి స్పందించి..

కేటీఅర్ అన్నా మా ఊరికి పంపండి.. మంత్రి స్పందించి..
x
Highlights

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం కావాలంటూ చాలా మంది తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు...

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం కావాలంటూ చాలా మంది తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని అనే ఓ అమ్మాయి హైదరాబాద్‌లో ఉండిపోయింది.

'ఉద్యోగం చూసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఎటూ వెళ్ళలేక ఇక్కడే ఇరుక్కుపోయాను. రెండు రోజుల నుంచి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్నా.. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు నాకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. నేను తిరిగి మా ఊరి వెళ్ళడానికి సాయం చేయండి' అని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ మంత్రి చెంతకు చేరడంతో ఆయనే స్వయంగా స్పందించారు. 'చెల్లెమ్మా! ఆందోళన చెందకు. మా బృందం నీకు సహాయం అందిస్తుంది' అని అభయం ఇచ్చారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories