మాజీ ఎంపీపీకి మంత్రి కేటీఆర్ చేయూత

మాజీ ఎంపీపీకి మంత్రి కేటీఆర్ చేయూత
x
KTR
Highlights

తోటివారికి సహాయం చేయాలంటే ఎప్పుడు ముందుంటారు తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. తాజాగా మాజీ ఎంపీపీకి

తోటివారికి సహాయం చేయాలంటే ఎప్పుడు ముందుంటారు తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. తాజాగా మాజీ ఎంపీపీకి సహాయాన్ని అందించారు మంత్రి, సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట కి చెందిన మాజీ ఎంపీపీ గంగసాయవ్వకి కేటీఅర్ అర్ధిక సహాయం అందజేశారు. వారంకిందట గంగసాయవ్వ కాలికి గాయమైంది. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకి వెళ్ళాలని సూచించారు.

దీనితో ఆమె హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలనీ అన్నారు. ఈ విషయం మంత్రి కేటీఅర్ దృష్టికి వెళ్ళగా అయన వెంటనే స్పందించి శస్త్రచికిత్సకు సీఎమ్మార్‌ఎఫ్ కింద రూ.రెండులక్షల ఎల్‌వోసీ మంజూరుచేశారు. వైద్యులు గురువారం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. చికిత్స అనంతరం మంత్రి ఆసుపత్రికి వెళ్లి గంగసాయవ్వను పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు మంత్రి కేటీఆర్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories