ముంబైలో తెలంగాణ వలస కార్మికుల కష్టాలు.. గూగుల్ పే ద్వారా మంత్రి ఆర్థిక సాయం

ముంబైలో తెలంగాణ వలస కార్మికుల కష్టాలు.. గూగుల్ పే ద్వారా మంత్రి ఆర్థిక సాయం
x
ముంబయిలో చిక్కుకున్న తెలంగాణ వలస కార్మికులు
Highlights

లాక్‌డౌన్‌ కరోనా వైరస్ ని కాస్త కట్టడి చేస్తున్నప్పటికీ వలస కూలీలను, పేదవారిని కష్టాల్లో నెట్టింది. ఎంతో మంది వలస కూలీలు తమ గ్రామాలకు రాకుండా బంధీ...

లాక్‌డౌన్‌ కరోనా వైరస్ ని కాస్త కట్టడి చేస్తున్నప్పటికీ వలస కూలీలను, పేదవారిని కష్టాల్లో నెట్టింది. ఎంతో మంది వలస కూలీలు తమ గ్రామాలకు రాకుండా బంధీ చేసింది. దీంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. రవాణా సౌకర్యం లేక పోవడంతో కొంత మంది ధైర్యం చేసి కాలినడక తమ తమ స్వగ్రాలకు చేరుకోగా కొంత మంది మాత్రం అక్కడే చిక్కుకు పోయారు. సమయానికి తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక అల్లాడిపోతున్నారు. ఈ కోణంలోనే తెలంగాణకు చెందిన చాలా మంది వలస కార్మికులు ముంబయి మహానగరంలో చిక్కుకుపోయారు. ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన చాలా మంది పొట్టకూటి కోసం ముంబైకి వెల్లిపోయారు. కరోనా వ్యాప్తి చెందడంతో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది దీంతో వారందరూ అక్కడే ఉండిపోయారు.

కాగా ప్రస్తుతం వారు తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన వలస కార్మికులతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. వారు పడుతున్న కష్టాలు విని, వారి దుస్థితిని చూసి చలించిపోయాడు. వెంటనే వారి గూగుల్ పే ద్వారా రూ.90వేల నగదును ట్రాన్స్ ఫర్ చేసారు. దీంతో ఆ వలస కార్మికులంతా మంత్రి దయాహృదయుడని, తమను ఆదుకున్న దేవుడని కొనియాడారు. తమను ఆదుకున్నందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక పోతే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరుకున్నాయి. వీరిలో 12 మంది ఆస్పత్రుల నుంచి ఈ రోజు డిశ్చార్జి కాగా, మరో 30 కేసులు నమోదయ్యాయి. కరోనా తొలికేసు నమోదయిన నాటినుంచి ఇప్పటివరకు 45 మంది కోలుకోగా, 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 308 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories