logo

7 సీట్లు ఓడిన తర్వాత టీఆర్ఎస్ నాయకులకు మతిమరుపు పెరిగింది: కిషన్ రెడ్డి

7 సీట్లు ఓడిన తర్వాత టీఆర్ఎస్ నాయకులకు మతిమరుపు పెరిగింది: కిషన్ రెడ్డి
Highlights

నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ అనడం మంచి సంస్కృతి కాదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 7 సీట్లు ఓడిన తర్వాత...

నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ అనడం మంచి సంస్కృతి కాదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 7 సీట్లు ఓడిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు మతిమరుపు పెరిగిందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు చాలా సార్లు నడ్డాను కలిసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ లేకపోతే కవిత ఎలా ఓడిపోయారు? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. నడ్డా అడిగిన ప్రశ్నలకు ముందు టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. తమ పార్టీ లక్ష్యం మున్సిపల్‌ ఎన్నికలు కాదని కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు.


లైవ్ టీవి


Share it
Top