హరితహరాన్ని ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమం లాగా తీసుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హరితహరాన్ని ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమం లాగా తీసుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
x
Highlights

కామారెడ్డి జిల్లాలో పర్యటించారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కామారెడ్డి రాశివనంలో మొక్కలు నాటారు . 2015 లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

కామారెడ్డి జిల్లాలో పర్యటించారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కామారెడ్డి రాశివనంలో మొక్కలు నాటారు . 2015 లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటిన మొక్కను పరిశీలించి, ఆ చెట్టు వద్ద ఫోటో దిగారు .ఈ సంవత్సరం 5వ విడత హరిత హారం కార్యక్రమంలో 83 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు .

నర్సరీల్లో 100 కోట్ల మొక్కలు పెంచుతున్నామని 24 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళుతున్నట్లు అయన తెలిపారు .అడవుల పెంపకానికి రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావాలని హరితహరాన్ని ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమంలా చేపట్టి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories