Top
logo

తెలంగాణలో పులుల సంఖ్య పెరగడం గర్వించదగ్గ విషయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణలో పులుల సంఖ్య పెరగడం గర్వించదగ్గ విషయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Highlights

తెలంగాణ రాష్టంలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించ దగ్గ పరిణామమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ...

తెలంగాణ రాష్టంలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించ దగ్గ పరిణామమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులు ఉన్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. గతంలో 20 పులులు ఉన్నట్లు ఓ అంచనా ఉండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యలే పులుల సంఖ్య పెరిగేందుకు దోహద పడ్డాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వేట, అడవుల నరికివేత, ఆవాసాల విధ్వంసం, పర్యావరణ మార్పులు, మనిషి-పులుల మధ్య ఘర్షణ తదితర కారణాల వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణలో ఉన్న రెండు పులుల సంరక్షణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మంచి రేటింగ్ ను ఇచ్చిందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినదించడం గొప్ప విషయమన్నారు.

Next Story