బడ్జెట్ లో విద్యుత్‌ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారో తెలుసా..?

బడ్జెట్ లో విద్యుత్‌ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారో తెలుసా..?
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం బడ్జెట్ ను ఆదివారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సమావేంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ విద్యుత్ శాఖకు రూ.10,416 కోట్ల బడ్జెట్ కేటాయించామని స్పష్టం చేసారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం బడ్జెట్ ను ఆదివారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సమావేంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ విద్యుత్ శాఖకు రూ.10,416 కోట్ల బడ్జెట్ కేటాయించామని స్పష్టం చేసారు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర చరిత్రలోనే 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో 13,168 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ వచ్చిందని తెలిపారు. ఇంత డిమాండ్‌ వచ్చినప్పటికీ ఒక్క సెకండ్‌ కూడా కరెంట్‌ పోకుండా రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా చేయగలగడం మనం సాధించిన విజయానికి సంకేతమని తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాడ ముందు, ఏర్పడిన కొత్తలో రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఆటంకంగా మారిన విద్యుత్ సమస్యను సీఎం ఛాలెజింగ్ గా తసుకున్నారని, దాంతోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఇందుకోసం ఎన్నో పథకాలను అమలు చేసారని, అదే విదంగా ఎన్నో వ్యూహాలు రూపొందించి అమలు చేశారని తెలిపారు. దాంతో ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కష్టాలు లేవని ప్రతి ఒక్క ఇంట్లో 24గంటల కరెంటు ఉందని తెలిపారు.

అదే విధంగా వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేసుకోగలుగుతున్నామని స్పష్టం చేసారు. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వలేదని ఆ ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దేశం ముందు తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ 24 గంటల విద్యుత్తు వలన రైతులు ఎంతగానో లాభపడుతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories