సైనికుల కష్టాలు చూడని వారు ఈ దృశ్యాలు చూడండి : హ‌రీష్‌రావు

సైనికుల కష్టాలు చూడని వారు ఈ దృశ్యాలు చూడండి : హ‌రీష్‌రావు
x
Highlights

లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. నిద్రాహారాలు మాని, వేళకు తిండి...

లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. నిద్రాహారాలు మాని, వేళకు తిండి లేకుండా, అవస్థలు పడుతూ కూడా, విధి నిర్వహణలో అలక్ష్యం చూపడం లేదన్నారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. సరిహద్దుల్లో సైనికులు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని ట్వీట్‌ చేశారు. వారికి శాల్యూట్ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ ట్వీట్ పై రాష్ట్ర డీజీపీ మహీందర్ రెడ్డి స్పందించారు. తమ పోలీసుల కష్టాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories