టిఫిన్ - ట్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

టిఫిన్ - ట్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు
x
మంత్రి హరీష్ రావు
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులోకి వచ్చింది. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులోకి వచ్చింది. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దీంతో చాలా మంది విద్యార్థులకు మంచి పౌష్టికరమైన ఆహారం లభిస్తుంది.

ఇదే కోణంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో టిఫిన్‌ - ట్యూషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్‌ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థినులందరికీ సాయంత్రం సమయంలో టిఫిన్‌ ను అందిస్తారు. అనంతరం అక్కడే శ్రద్ధగా చదివిస్తారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ ఈ విధంగా చదివించడం వలన విద్యార్థలు చదుల్లో మంచి నైపున్యాన్ని సాధిస్తారని తెలిపారు.

ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు. విద్యార్థులు టీవీ సీరియల్స్‌, మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories