ఆరు యూనిట్లుగా గాంధీ ఆస్పత్రి : మంత్రి ఈటెల

ఆరు యూనిట్లుగా గాంధీ ఆస్పత్రి : మంత్రి ఈటెల
x
Minister Etela Rajender
Highlights

గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వ్యక్తుల అడ్మిషన్లు, వైద్యం, పరీక్షలు, డిశ్ఛార్జ్‌లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వ్యక్తుల అడ్మిషన్లు, వైద్యం, పరీక్షలు, డిశ్ఛార్జ్‌లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా ( కోవిడ్ 19) ఆస్పత్రిగా మార్చామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ కరోనా కేసు నమోదయినా వారిని గాందీకి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఈ నేఫథ్యంలోనే కరోనా బాధితులకు మరింత పఠిష్టమైన చికిత్స అందించేందుకు గాను ఆస్పత్రిని ఆరు యూనిట్లుగా విభజించాలని అధికారులకు సూచించారు. యూనిట్లను విభజించిన తరువాత ఒక్కో యూనిట్ కి ఒక్కో ప్రొఫెసర్‌ను ఇంఛార్జ్‌గా నియమించాలని తెలిపారు. ప్రతి ఒక్క యూనిట్లో రోగుల సంఖ్య సమానంగా ఉండేలా సమన్వయం చేయాలని, ఆ బాధ్యత ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావుకు అప్పగించారు. బాధితుల్లో చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఉన్నా, చిన్నారులు ఉన్నా వారిని ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులకు సూచించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పీడియాట్రీషియన్లను నియమించాలని, వారి పర్యవేక్షణలో చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

బాధితులు ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వారు ఇంటికి వెల్లేంత వరకు బాధితులకు సంబంధించిన సమాచారం పూర్తిగా నమోదు చేసి సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. బాధితులను నిత్యం అబ్జర్ వేషన్ లో ఉంచి వారికి ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. అంతే కాక వైద్య సిబ్బంధి విధిగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories