కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దు : మంత్రి ఈటల

కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దు : మంత్రి ఈటల
x
మంత్రి ఈటల రాజేందర్
Highlights

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని ప్రయివేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల...

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని ప్రయివేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల కోరారు. కరోనా పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ ప్రతినిధులతో మంత్రి ఈటల, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి ఆరోగ్య శ్రీ టస్టు భవనంలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పరీక్షలు చేస్తున్న ప్రతి ఒక్క లాబ్ టెక్నీషియన్‌లు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్లు వాడేలా చూడాలని ఈటల కోరారు. వాటిని వాడడం తప్పనిసరి అని వాడనపక్షంలో లాబ్ టెక్నిషియన్లకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని, టెస్టుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సాధారణ పరీక్షలకు కోవిడ్ పరీక్షలకు చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. ఇక్కడ సర్వెలేన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయని ఆయన చెప్పారు. అందుకే పాజిటివ్ వచ్చిన ప్రతి పేషంట్ వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి సూచించారు. కరోనా టెస్టు కోసం వచ్చిన ప్రతి ఒక్కర్నీ టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఐసొలేషన్‌లో ఉండాలని సూచించాలని డయాగ్నోస్టిక్ సెంటర్లను మంత్రి ఆదేశించారు. విమాన ప్రయాణికులకు కరోనా లక్షణాలు లేకపోయినా టెస్టులు చేసి రిపోర్టు ఇవ్వొచ్చన్నారు. కరోనా టెస్టులు ఇంటికొచ్చి చేస్తామని లేదా ఇతర పద్ధతుల్లో మార్కెటింగ్ చేయొద్దని ఈటల కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories