ప్రజలు భయాందోళనకు గురికావొద్దు : మంత్రి ఈటల

ప్రజలు భయాందోళనకు గురికావొద్దు : మంత్రి ఈటల
x
మినిస్టర్ ఈటల రాజేందర్
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎక్కడా, ఎలాంటి నిర్ధారణ కాలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

గతవారం రోజుల నుంచి ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ లో కూడా ప్రవేశించిందని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రజేందర్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎక్కడా, ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్‌కు సంబంధించి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అన్ని విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాపించిందనే అనుమానంతో కేంద్రం నుంచి 35 మందితో కూడిన వైద్య నిపుణుల బృందం పట్టణానికి వచ్చిందని. ఈ బృందం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రులను సందర్శించారని, బుధవారం దీనికి సంబంధించి వివారలు వైద్య బృందం వెల్లడి చేస్తుందని తెలిపారు.

ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్షను బుధవారం జరిపిన తరువాత వైద్య బృందం తెలిపిన వివరాలను వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. అప్పటి వరకూ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు.

ఇప్పటికే కరోనా వైరస్ గురించి వస్తున్న వార్తలను విని గాంధీ, ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేయించామని తెలిపారు. చైనా నుంచి వారిని, అదేవిధంగా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో వచ్చే రోగులను ఈ వార్డులలో ఉంచి చికిత్స అందిస్తారని తెలిపారు.

ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా 7 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షల కోసం విభాగాలను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి, వైరస్ లక్షణాలున్న వారిని నేరుగా ఆస్పత్రులకు పంపిస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories