RSS వాళ్లు నన్ను టచ్ కూడా చేయలేరు: అక్బరుద్దీన్

RSS వాళ్లు నన్ను టచ్ కూడా చేయలేరు: అక్బరుద్దీన్
x
Highlights

కేవలం పదిహేనంటే 15 నిమిషాలు.. పోలీసులను పక్కకు తప్పుకోమనండి.. ముస్లిం సత్తా ఏంటో హిందువులకు చూపిస్తామంటూ గతంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం...

కేవలం పదిహేనంటే 15 నిమిషాలు.. పోలీసులను పక్కకు తప్పుకోమనండి.. ముస్లిం సత్తా ఏంటో హిందువులకు చూపిస్తామంటూ గతంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి రెచ్చిపోయారు. కరీంనగర్ ఎంఐఎం సభలో ఆవేశంతో ఊగిపోయిన అక్బరుద్దీన్‌.. బీజేపీ అండ్ ఆర్‌ఎస్‌ఎస్‌ టార్గెట్‌గా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చేసిన హెచ్చరికలు ఆర్‌ఎస్ఎస్‌‌ను వెంటాడుతున్నాయన్న అక్బరుద్దీన్‌ ఓవైసీ ఎంఐఎంను తాకే ధైర్యం వాళ్లకు లేదంటూ విరుచుకుపడ్డారు. సమాజం భయపడే వాడినే భయపెడుతుందన్న అక్బరుద్దీన్‌ తనను టచ్ చేసే ధైర్మం ఆర్‌ఎస్‌ఎస్‌కు లేదన్నారు.

ప్రధాని మోడీపైనా నిప్పులు చెరిగిన అక్బరుద్దీన్‌ ఓవైసీ.. దేశానికి కావాల్సింది చాయ్‌వాలా, పకోడివాలా కాదంటూ సెటైర్లు వేశారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్రధానమంత్రి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కానే కాదన్న అక్బరుద్దీన్‌ బీజేపీ వాళ్లే గాడ్సే వారసులంటూ ఆరోపించారు. బీజేపీ అండ్ ఆర్‌ఎస్‌ఎస్‌ టార్గెట్‌గా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ మరో సంచలన కామెంట్స్ కూడా చేశారు. తాను ఎంతకాలం బతుకుతానో తెలియదని ఏ క్షణమైనా మరణం తనను పలకరించొచ్చని అన్నారు.

అయితే మరణం విషయంలో తనకు బాధలేదని, కానీ బీజేపీ బలపడటమే తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఎంఐఎంకు ఓటు వేయకపోయినా బాధ పడను కానీ బీజేపీ గెలిస్తే మాత్రం సహించలేనంటూ అక్బరుద్దీన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడం తీవ్ర మనస్తాపం కలిగించిందన్నారు. గతంలో కరీంనగర్‌‌కు ముస్లిం డిప్యూటీ మేయర్‌గా ఉండేవారని, అలాంటిది ఇప్పుడు పరిస్థితి తారుమారైందన్నారు.అక్బరుద్దీన్ లేటెస్ట్ కామెంట్స్‌‌పై తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories