కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని కితాబిచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని కితాబిచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
x
Highlights

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వెడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి...

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వెడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విమర్శిస్తే... ఆధారాలు లేని విమర్శలు చేయొద్దని సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలో వాడీవేడిగా సాగాయి. సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను మస్లిజ్ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమైనది కితాబిచ్చారు అక్బరద్దీన్ ఓవైసీ.

ప్రస్నోత్తరాల్లో భాగంగా టాస్క్ సంస్థ ద్వారా లక్షలాది మంది యువతకు శిక్షణ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ విశేష ప్రగతి సాధించిందన్నారు. ఖమ్మం, కరీంనగర్‌లో రాబోయే నెలలోనే ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నామని కేటీఆర్ తెలిపారు. బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు భట్టి విక్రమార్క్, సీఎం కేసీఆర్ మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ప్రభుత్వం చెబుతున్న అంశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందా.. దానిని నిరూపించగలరా అని భట్టికి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చని.. కానీ అసత్యాలను మాట్లాడకూడదని అన్నారు. భట్టి.. కేసీఆర్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అన్ని చెప్పినా.. తమపై అక్కసు కక్కుతున్నారని కేసీఆర్ అంటే. తమకు ప్రభుత్వంపై ఎలాంటి అక్కసు లేదని భట్టి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories