logo

అసదుద్దీన్ ఒవైసిని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

అసదుద్దీన్ ఒవైసిని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మజ్లిస్ తరపున సహాయ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అసద్ వైసీపీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నిన్న హైదరాబాద్‌లో ఎంఐఎం అధినేత అసద్దుద్దిన్ ఒవైసితో ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి సమావేశమయ్యారు. దాదాపు 4 గంటలపాటు వీరిద్దరూ చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని అసద్.. గౌతమ్ రెడ్డికి చెప్పారు.

మరోవైపు మర్యాదపూర్వకంగానే తాను అసద్ ను కలిశానని గౌతమ్ రెడ్డి చెబుతున్నప్పటికీ వీరిమధ్య ప్రచార అవగాహన కుదిరినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అటు జగన్‌తో పాటు ఇటు అసద్‌కు సన్నిహితుడిగిగా మేకపాటి గౌతంరెడ్డికి పేరుంది. అందుకే ఆయన ద్వారానే మిత్రబంధం బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ముందడుగు పడినట్లయింది. కాగా వచ్చే ఎన్నికల్లో మజ్లీస్ మద్దతు వైసీపీ, తెరాసకేనని అసద్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

లైవ్ టీవి

Share it
Top