సైకిల్ పై 1000 కి.మీ. ప్రయాణించిన జంట...

సైకిల్ పై 1000 కి.మీ. ప్రయాణించిన జంట...
x
Migrant Labour Couple cycles
Highlights

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను పొడిగించడంతో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను పొడిగించడంతో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వారు తమ సొంత గ్రామాలకు చేరుకోవాలని సాహసాలు చేస్తున్నారు. వందల కిలో మీటర్లు నడవడానికి కూడా సిద్దపడుతున్నారు. ఏదో ఒక రకంగా తమ స్వస్థలానికి చేరుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒడిశా నుంచి తెలంగాణకు కూలిపనులు చేసుకోవడానికి వలస వచ్చిన ఓ జంట తమ గ్రామానికి చేరుకోవాలనుకుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా ఓ సైకిల్ పై తొమ్మిది రోజులు ప్రయాణం చేసి పోలీసుల చెక్‌పోస్టులు, సరిహద్దులు దాటింది. చివరికి తమ గమ్యస్థానం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు శనివారం (ఏప్రిల్ 25) చేరుకుంది. తమ కుటుంబ సభ్యులను మరికొద్ది క్షణాల్లో కలుసుకుంటాం అనుకునే సమయంలోనే పోలీసులు వారిని అడ్డుకుని క్వారంటైన్‌కు తరలించారు.

పూర్తివివరాల్లోకెళితే ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఖైరాపుట్‌ మండలం సింధిగుడా గ్రామానికి చెందిన దంపతులు పొట్టకూటికోసం తెలంగాణలోని కరీంనగర్‌కు కూలిపనులు చేయడానికి వలస వచ్చారు. కానీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో చేయడానికి పనులు, తినడానికి తిండి, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇబ్బందులు పడుతూ ఉండడం కన్నా ఏదో ఒక విధంగా తమ గ్రామానికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. తాము పనిచేసే కాంట్రాక్టర్‌ దగ్గర రూ.7 వేలు తీసుకొని 5వేల రూపాయలతో సైకిల్ కొని తమ గ్రామానికి ప్రయాణం అయ్యారు. అలా రాత్రి పగలు ప్రయాణించి అన్ని అడ్డంకులను ఎదుర్కొని 9వ రోజు తమ గ్రామానికి చేరుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories