logo

నల్గొండ యువకుడికి మైక్రోసాఫ్ట్ ఆఫర్‌ : ఏడాదికి 1.54 కోట్లు

నల్గొండ యువకుడికి మైక్రోసాఫ్ట్ ఆఫర్‌ : ఏడాదికి 1.54 కోట్లుమైక్రోసాఫ్ట్
Highlights

తెలంగాణ విద్యార్థి చదువులో తన సత్తాను చాటాడు. ఇప్పటివరకూ తెలంగాణలో ఏ ఇంజనీరింగ్ విద్యార్థి పొందని వేతనాన్ని ఈ విద్యార్థి తన సొంతం చేసుకుంటున్నాడు.

తెలంగాణ విద్యార్థి చదువులో తన సత్తాను చాటాడు. ఇప్పటివరకూ తెలంగాణలో ఏ ఇంజనీరింగ్ విద్యార్థి పొందని వేతనాన్ని ఈ విద్యార్థి తన సొంతం చేసుకుంటున్నాడు. ఈ విద్యార్థి పూర్తి వివరాల్లోకెళితే బాంబే ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన చింతరెడ్డి సాయిచరిత్‌ రెడ్డి. ఈ విద్యార్థి తన చదువును ఈ ఏడాదితో ముగించుకోనున్నాడు.

దీంతో ఈ విద్యార్థి క్యాంపస్ ఇంటర్వూలో బంపర్ ఆఫర్ ను పొందాడు. ఏడాదికి రూ. 1.54 కోట్ల వేతనాన్ని ఇచ్చే ప్రముఖ ఐటీ, సాఫ్ట్ వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీలో కొలువును కొట్టాడు. ఇటీవల ఐఐటీలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ జరుగగా ఈ యువకుడితో పాటు మరో ముగ్గురికి ఇంత భారీ ఆఫర్ లభించింది. ఆ నలుగురిలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుడు సాయిచరిత్ ఒక్కడే ఉన్నాడు. ఈ విషయం పై చరిత్ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తమ కుమారుడికి మైక్రోసాఫ్ట్ లో ఇంత మంచి ఆఫర్ రావడం ఎంతో ఆనందంగా ఉందని చరిత్ తల్లిదండ్రులు సైదిరెడ్డి, సీత అంటున్నారు. తమ కొడుకు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదివాడని, ఇప్పటికి ఫలితం దక్కిందని వారు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్ట పడి చదివితే ఆ కష్టం ఎక్కడికీ పోదని వారు ఈ సందర్భంగా తెలిపారు.



Web TitleMicrosoft offers good package for Nalgonda teenager

లైవ్ టీవి


Share it
Top