టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త వార్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త వార్
x
టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త వార్
Highlights

టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త వార్‌ తెరలేచింది. మెట్రో ప్రారంభం ప్రొటోకాల్‌ పాటించలేదంటూ కమలం నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు...

టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త వార్‌ తెరలేచింది. మెట్రో ప్రారంభం ప్రొటోకాల్‌ పాటించలేదంటూ కమలం నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు మెట్రోలో ప్రయాణించనున్నారు బీజేపీ నేతలు. మెట్రో అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం జరుపనున్నారు.

జేబీఎస్, ఎంజీబీఎస్‌ మెట్రో రైల్‌ ప్రారంభం గులాబీ, కమలం పార్టీల మధ్య రచ్చకు దారి తీసింది. ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదంటూ బీజేపీ ఫైర్ అవుతోంది. మెట్రో మార్గం ప్రారంభాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చిందంటున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావులకు కనీసం గౌరవం ఇవ్వలేదంటున్నారు. కిషన్‌రెడ్డి రాకూడదన్న ఉద్దేశంతోనే పార్లమెంట్ జరుగుతున్న సమయంలో మెట్రోను ప్రారంభించారని కమలదళమంటోంది. కేంద్రమంత్రి సొంత నియోజవర్గమైన సికింద్రాబాద్ నుంచి మెట్రో రైల్‌ వెళుతున్నా ప్రొటోకాల్ పాటించకపోవటాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు బీజేపీ నేతలు మెట్రోలో ప్రయాణించాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం మెట్రో అధికారుల నుంచి బీజేపీ నాయకులు అనుమతి తీసుకున్నారు. బీజేపీ మెట్రో ప్రయాణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, సిటీ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రారావుతోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు. మెట్రో జర్నీకి ముందు మెట్రో అధికారులతో కిషన్ రెడ్డి రివ్యూ మీటింగ్ జరుపనున్నారు. దిల్‌ కుష్ గెస్ట్‌హౌస్‌లో సమీక్షా సమావేశం జరుగనుంది. బీజేపీ నాయకుల మెట్రో జర్నీ రెండు పార్టీల మధ్య ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories