logo

డిసెంబర్ 31న మెట్రో రైలు సమయాల్లో మార్పులు

డిసెంబర్ 31న మెట్రో రైలు సమయాల్లో మార్పులు
Highlights

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు...

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు అధికారులు. అర్ధరాత్రి వరకు న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో మియాపూర్, ఎల్బీనగర్, నాగోలు నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయలు దేరనుంది. అలాగే అమీర్ పేట నుంచి అర్ధరాత్రి 12.30 కు చివరి మెట్రో రైలు బయలుదేరనున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు. కాగా న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అనుమతించిన సమయం వరకే వేడుకలు చేసుకోవాలని ఆదేశించింది. అలాగే ఒక గంట మాత్రమే టపాసులు పేల్చాలని చెప్పింది.


లైవ్ టీవి


Share it
Top