Top
logo

మూడు రోజులు మీ-సేవా కేంద్రాలు బంద్‌..

మూడు రోజులు మీ-సేవా కేంద్రాలు బంద్‌..
X
మీ సేవా
Highlights

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు మీ సేవా కేంద్రాలు మూతపడనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు మీ సేవా కేంద్రాలు మూతపడనున్నాయి. ఈ విషయాన్ని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మీ-సేవా డేటా బేస్‌ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా మూడు రోజుల పాటు కార్యాలయాలను మూసేస్తున్నట్టు ఆయన ప్రజలకు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలను మూసేస్తున్నారన్నారు. ఈ నెల13 రాత్రి 7 గంటల నుంచి 16 డిసెంబర్‌ ఉదయం బందుంటాయని సమాచారం. తిరిగి డిసెంబర్‌ 16 ఉదయం 8 గంటల నుంచి మీ సేవా కేంద్రాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ విరామానికి ప్రజలు సహకరించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Web TitleMee Seva service centers bandh for three days in Telangana
Next Story