ఈ 9రోజులు అత్యంత కీలకం..జర భ్రద్రం!

ఈ 9రోజులు అత్యంత కీలకం..జర భ్రద్రం!
x
Highlights

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ముగియడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఈనెల14న గడువు తీరనుండటంతో ఈ 9 రోజులు...

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ముగియడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఈనెల14న గడువు తీరనుండటంతో ఈ 9 రోజులు అత్యంత కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.

వైరస్‌ సోకిన వ్యక్తుల్లో అత్యధికుల్లో సాధారణంగా లక్షణాలు బయటపడటానికి 14 రోజుల సమయం పడుతోందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న నమోదవ్వగా, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు గతనెల 22 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత రైళ్లు, దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణికులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో వైరస్‌ సోకినట్లు వెల్లడించారు. మర్కజ్‌ ప్రయాణికులు మార్చి 17-19 తేదీల్లో రాష్ట్రానికి వచ్చారని వీరిలో అత్యధికులను, వీరితో కలివిడిగా ఉన్నవారిని 4 వేల మందిని 2వ తేదీ నాటికే విడి గదుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. వీరిలోనూ వైరస్‌ సోకే అవకాశలెక్కువగా ఉన్న అనుమానాస్పద వ్యక్తుల్లో 2వేల మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిద్వారా వైరస్‌ వ్యాప్తి చెందిన వారిలో బయటపడటానికి మరో 7 నుంచి10 రోజుల సమయం పడుతుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒక వ్యక్తి నుంచి వైరస్‌ సగటున ముగ్గురికి వ్యాప్తి చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురూ ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున ఇలా వేల సంఖ్యలో వైరస్‌ వ్యాప్తి తెలియకుండానే జరిగిపోతుందని కాబట్టి ఈనెల 14 వరకూ ఇంటిపట్టునే ఉండాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories